నవతెలంగాణ – పరకాల
పరకాల మండలం నాగారం, వెల్లంపల్లి లోని జడ్పీ ఉన్నత పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదివారం పరిశీలించారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి పోలింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాగారంలో ఎంతమంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారని ఇన్స్పెక్టర్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించి ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కౌంటింగ్ టేబుల్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. పోలింగ్ మెటీరియల్ ను భద్రపరచడంలో రిటర్నింగ్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు, పోలింగ్ వివరాలను ఎంపీడీవో విమల కలెక్టర్ కు వివరించారు. పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, తహసిల్దార్ విజయలక్ష్మి, ఏసిపి సతీష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పరకాల ఎంపీడీఓపై కలెక్టర్ సీరియస్
పరకాల మండలం నాగారంలో కలెక్టర్ స్నేహ శబరీస్ ఎంపీడీవో విమలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా కౌంటింగ్ బుట్టలకు స్టిక్కర్లు అంటించకపోవడం, కౌంటింగ్ ఏర్పాట్లు సైతం సరిగా లేకపోవడంతో ప్రొసీడింగ్ అధికారి తో పాటు, ఎంపీడీవో విమలపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.



