Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజి ఆఫ్ తెలంగాణ పోస్టర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ  పోర్టల్ ద్వారా జిల్లా లోని  నిరుద్యోగ యువతీ యువకులు, జిల్లా లోని పరిశ్రమల యాజమానులు ఈడిఈఈటి పోర్టల్ లో రిజిస్టర్ చేసుకున్నట్లైతే నిరుద్యోగులకు  వారి వారి అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని అన్నారు.

పరిశ్రమల యజమానులు తమ దగ్గరున్న ఉద్యోగ అవకాశాలను ఈ పోర్టల్ లో  పెట్టుట జరుగుతుందనీ, వివిధ ఉద్యోగాలకు కావలసిన అర్హతలున్నటువంటి, నమోదు చేసుకున్న నిరుద్యోగులకు సమాచారము వెళుతుందనారు. ఆ రకంగా ఈ పోర్టల్ లో ఉద్యోగము కోరేవారికి, ఉద్యోగాలిచ్చే వారిలో అనుసందానము చేసి  ఇద్దరికీ ఉపయోగకారిగా ఉంటుంది. జిల్లా అధికారులు, మండల స్పెషల్  అధికారులు దీనిని క్షేత్రస్థాయీలో విస్తృతంగా ప్రచారం చేసి సాధ్యమైనంత ఎక్కువమంది నిరుద్యోగులు నమోదు చేసుకునేట్లు చూడాలని ఆదేశించారు.

మండల స్థాయీ కార్యాలయాలు ప్రముఖ ప్రదేశాలలో ఈ పోస్టర్ లో ఉన్న క్యూఆర్ కోడు ద్వార అతి సులభంగా మొబైలు  ఫోను ద్వార  యువత  నమోదు చేసుకోవచ్చని, జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.   ఈ కార్యక్రమములో  ఆదనపు కలెక్టర్(రెవెన్యూ),  జిల్లా పరిశ్రమల కేంద్రం, జనరల్ మేనేజరు రవీందర్ , డిఆర్డిఓ నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి,డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సాహితి , జిల్లా అధికారులు   పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -