Friday, January 9, 2026
E-PAPER
Homeజిల్లాలుటీఎన్జీవోస్ క్యాలెండర్లను ఆవిష్కరించిన కలెక్టర్

టీఎన్జీవోస్ క్యాలెండర్లను ఆవిష్కరించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట రెడ్డి ఆధ్వర్యంలో 2026వ సంవత్సరం గోడ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ రెండింటిని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ చేతుల మీదుగా టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కలెక్టర్  ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడతూ సంక్షేమ పథకాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఉద్యోగులుగా తీసుకెళ్లి కామారెడ్డి జిల్లాను ముందంజలో ఉంచాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

టి ఎన్ జి ఓస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నరాల వెంకట రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగుల సమస్యల సాధనకు టీఎన్జీఓస్ కామారెడ్డి జిల్లా ఎల్లప్పుడు కృషి చేస్తుందని, జిల్లా పాలనాధికారి  యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉద్యోగుల పైన ఉండాలని కోరారు. అనంతరం జిల్లా కార్యదర్శి ముల్క నాగరాజు  మాట్లాడుతూ ఈ 2026 సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించిన సందర్భంగా ఉద్యోగులకు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ  కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ సహాధ్యక్షులు సహాధ్యక్షులు ఎం చక్రధర్, జిల్లా కోశాధికారి ఎం దేవరాజు, కేంద్ర సంఘ బాధ్యులు శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జే శ్రావణ్ కుమార్, సిహెచ్ పోశయ్య, జిల్లా సంయుక్త కార్యదర్శి రమణ కుమార్, రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ  సంతోష్ కుమార్, పబ్లిసిటీ సెక్రెటరీ రాజ్ కుమార్,  జిల్లా కార్యవర్గ సభ్యులు  దత్తాత్రి, లక్ష్మణ్, అశ్వక్ అర్బన్ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సృజన్ సృజన్ కుమార్, ఉపాధ్యక్షులు ఎం కిషన్, కార్యవర్గ సభ్యులు అనుదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -