– కలెక్టర్ ను కోరుతున్న పట్టణవాసులు
– చెత్త సేకరణలో అశ్రద్ధ వహిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలి
– ఊరు బయట వేసిన చెత్త గురించి ఆలోచిస్తున్న కలెక్టర్ పట్టణం గురించి ఆలోచించాలి
– కామారెడ్డి పట్టణవాసులు
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణ కేంద్రంలో కలెక్టర్ ఓసారి పర్యటించాలని, పరిసరాలను గమనించాలని కామారెడ్డి పట్టణవాసులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామానికి వెళ్లి వస్తున్న సమయంలో చిన్న మల్లారెడ్డి గ్రామం ఆరుబయట వేసిన చెత్తను గమనించి తన వాహనాన్ని ఆపి కార్యదర్శితో పాటు ఎంపీడీవోను ఇలాంటి చెత్త వేయకుండా పరిసరాలను అపరిశుభ్రం చేయకుండా చూడాలని ఆదేశించారు.
కామారెడ్డిలో ఎక్కడపడితే అక్కడ చెత్త, డ్రైనేజీల జామ్
కామారెడ్డి పట్టణంలో ఎన్జీవో ఎస్ కాలనీ తో పాటు విద్యానగర్ వివిధ చోట్ల కొందరు చేత్తను ఎక్కడపడితే అక్కడ వేయడంతో పరిసరాలన్నీ అపరిశుభ్రతతో మారిపోవడమే కాకుండా ఆ చెత్తలో నుండి ప్లాస్టిక్ ఇతర వ్యర్ధాలు డ్రైనేజీలో పడడంతో నీరు వెళ్ళాక డ్రైనేజీ జామ్ అయి దుర్వాసన, దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు ప్రజలే అవకాశం ఉంది.
వ్యాధులు వచ్చిన తర్వాత హడావుడి చేసే అధికారులు ఆ వ్యాధులు రాకుండా కట్టడి చేయాలి
జనవాసాల మధ్య చెత్త వేయడం, తద్వారా డ్రైనేజీలు జాము కావడంతో దుర్వాసన రావడంతో పాటు దోమలు వృద్ధి చెంది అవి కుట్టడం వల్ల దోమల కాటు వల్ల చాలా రకాల వ్యాధులు వస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.
మలేరియా : ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. దీని లక్షణాలు ఎక్కువగా చలితో కూడిన జ్వరం, వణుకు, తలనొప్పి, వాంతులు.
డెంగ్యూ (Dengue): దీనిని “ఎముకల విరిచే జ్వరం” అని కూడా అంటారు. ఇది ఏడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల వస్తుంది. ఈ దోమ పగటిపూట ఎక్కువగా కుడుతుంది.
డెంగ్యూ లక్షణాలు: అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల, కండరాల నొప్పులు, తలనొప్పి, కంటి వెనక నొప్పి, ఒంటిపై దద్దుర్లు లాంటివి వస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.
చికున్ గున్యా :r54 ఇది కూడా ఏడిస్ ఈజిప్టి దోమ ద్వారా వ్యాపిస్తుంది. దీని ప్రధాన లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన కీళ్ల నొప్పులు, తలనొప్పి, అలసట, దద్దుర్లు.
జికా వైరస్
ఇది ఏడిస్ జాతి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుంది, కానీ గర్భిణీ స్త్రీలకు సోకితే శిశువుల్లో తీవ్రమైన జనన లోపాలు (ఉదాహరణకు, మైక్రోసెఫాలీ) రావడానికి కారణమవుతుంది. మెదడువాపు వ్యాధి, దీనిని “జపనీస్ ఎన్సెఫాలిటిస్” అని కూడా అంటారు. ఈ వ్యాధి క్యూలెక్స్ (Culex) జాతి దోమల ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల మెదడుకు వాపు వచ్చి తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుంది.
పసుపు జ్వరం..
ఇది కూడా ఏడిస్ దోమల వల్ల వ్యాపించే వైరల్ వ్యాధి. దీని లక్షణాలు అధిక జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి, కామెర్లు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించడానికి, దోమలు పెరిగే ప్రదేశాలను (నిలిచి ఉన్న నీరు వంటివి) తొలగించడం, దోమతెరలు వాడటం, దోమల నివారణ మందులను ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
అధికారులు చొరవ తీసుకుంటే సమస్యను పరిష్కరించవచ్చు: మల్లికార్జున్ ఎన్జీవోస్ కాలనీ
అధికారులు అపరిశుభ్రత పట్ల తగిన శ్రద్ధ తీసుకుంటే ఈ చెత్త వేయడాన్ని అరికట్టే అవకాశం ఉంది. అధికారులు ఇతర పనుల బీజిల్లో పడి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ చెత్త వల్ల ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశం ఉన్న అధికారులు మాత్రం ఈ చెత్త వేయడాన్ని నివారించలేకపోతున్నారు. సూచనలు సలహాలు కాదు జరిమానాలు విధిస్తేనే చెత్త వేయడం ఆగుతుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి.
కలెక్టర్ గారు కామారెడ్డి పట్టణంలో పర్యటించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES