పిఎన్ఎమ్ జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు.
నవతెలంగాణ – భువనగిరి
కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం అని పిఎన్ఎం జిల్లా కార్యదర్శి ఈర్లపల్లి ముత్యాలు అన్నారు. బుధవారం భువనగిరి సుందరయ్య భవనం లో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ సభ్యులు దేశపాక రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలు, మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు కళాకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కళాకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చి నెలలు గడుపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన విధంగా ఉన్నది వృత్తి కళాకారులకు 5వేల,రూపాయలు పింఛను ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ఫిబ్రవరిఆఖరి మాసంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి జానపద వృత్తి కళాకారుల గ్రామీణ సర్వే నిర్వహించి సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారంకై చలో కలెక్టరేట్ నిర్వహిస్తాం మని హెచ్చరించారు కళాకారులైనటువంటి చందు, యక్షగానం, కోలాటం, బాగోతం, భజన కళాకారులకు, ప్రభుత్వం గుర్తించి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని లేనియెడల జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ముందు కాలుకు గజ్జ కట్టి చేత డప్పు పట్టి భుజాన గొంగడి వేసి పాలకుల విధానాలను ఆటపాటల ద్వారా కళాకారులను సమీకరించి ప్రభుత్వ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి జిల్లా ఉపాధ్యక్షులు గుండు నరసింహ జిల్లా సహాయ కార్యదర్శి వడ్లకొండ బిక్షపతి జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్ కుమార్ , మధ్యబోయిన శివ, నేలపట్ల శంకర్, చిట్యాల శ్రీమాన్, బండారి మనిషా, ఈర్లపల్లి నరసమ్మ పాల్గొన్నారు.



