Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మార్కెట్ లో ఆకట్టుకుంటున్న రంగురంగుల రాఖీలు.

మార్కెట్ లో ఆకట్టుకుంటున్న రంగురంగుల రాఖీలు.

- Advertisement -

కనువిందు చేస్తున్న అందమైన రాఖీలు..
నవతెలంగాణ – కంటేశ్వర్ 

నగరంలో రంగురంగుల రాఖీలు మార్కెట్ లో ఆకట్టుకుంటున్నాయి. శనివారం రాఖీ పండగ కావడంతో అందమైన రాఖీలు కట్టడానికి సోదరులకు సోదరీమణులు సిద్ధమయ్యారు. ట్రెండ్ కి దాగినట్టు రకరకాల రాఖీలుమార్కెట్ లోకి వచ్చేసాయి. పది రూపాయల నుంచి వందలాది రూపాయల రాఖీలు మార్కెట్ లో కనువిందు చేస్తున్నాయి. రాఖీ పండుగను చాలా జోష్ గా చేసుకోవడానికి ఇందూరు నగర ప్రజలు రెడీ అయ్యారు. రాఖీలు కొనుగోలు చేయడానికి మహిళలు చాలామంది దుకాణాల వద్ద కొనుగోలు చేస్తున్నారు. తమ సోదరులకు కట్టడానికి అందమైన రాఖీలను కొనుగోలు చేయడానికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో రాఖీ దుకాణాల వద్ద కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో అక్కడ సందడి నెలకొంది.

నగరంలోని కుమార్ గల్లి, గాంధీ చౌక్, కిసాన్ గంజ్, పెద్ద బజార్, రాజ రాజేంద్ర చౌరస్తా, వర్ని రోడ్డు, వినాయక నగర్, కంటేశ్వర్, సుభాష్ నగర్, దుబ్బ, నాందేవ్ వాడ, తదితర ప్రాంతాల్లో ప్రత్యేక దుకాణాల వెలిశాయి. వివిధ ప్రాంతాల్లో గల సోదరులకు అందమైన రాఖీలను కట్టడానికి సోదరులు రాఖీలను కొనుగోలు చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాఖీ దుకాణాలకు వెళ్లడంతో సందడి నెలకొంది . రాఖీ పండగను అత్యంత వైభవంగా జరుపుకోవడానికి ఇందూరు వాసులు తమ సోదరులకు రాఖీలు కొనడానికి రావడంతో సందడి నెలకొని పండుగ వాతావరణం ఏర్పడింది.గొండలు డజన్ పది రూపాయలు, పూసల రాఖీలు పది రూపాయల నుంచి 100 రూపాయల వరకు, చెక్క గణపతి, సాయిబాబా వెంకటేశ్వర స్వామి సరస్వతి ఇలా దేవతల విగ్రహాలతో కూడిన రాఖీలు 30 రూపాయలు 200 వరకు లాకెట్ రాకెట్లు పది రూపాయల నుంచి 280 రూపాయల వరకు ఫ్రెండ్ కు తగ్గట్టుగా రాఖీలు మార్కెట్ లో విక్రయిస్తున్నారు. వెరైటీ లలో సుమారు 500 రూపాయల తోరాఖీలు కొనుగోలు దారులతో మార్కెట్ సందడి నెలకొంది.

స్వీట్లు దుకాణాలలో సందడి..

నగరంలోని స్వీట్ దుకాణాలలో వరలక్ష్మి వ్రతాలు రక్షాబంధన్ సందర్భంగా కొనుగోలు దారులతో దుకాణాల సందడిగా మారాయి. స్వీట్స్ 520 నుంచి 680 వరకు కిలో అమ్ముతున్నారు. దూది పేడ 440, రసగుల్లా 480 కిలో చొప్పున అమ్ముతున్నారు. మామూలే స్వీట్స్ వంద రూపాయలు పావుకిలో అమ్ముతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img