Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ 100 ఏండ్ల ముగింపు బహిరంగ సభకు తరలిరండి...

సీపీఐ 100 ఏండ్ల ముగింపు బహిరంగ సభకు తరలిరండి…

- Advertisement -

నవంబర్ 15-21 వరకు బస్సుజాత…

17న డిండికి బస్సు జాత…

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి

నవతెలంగాణ డిండి: డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ 100 ఏండ్లు ముగింపు బహిరంగ సభను పార్టీ శ్రేణులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం డిండి సీపీఐ కార్యాలయంలో మండలం సహాయ కార్యదర్శి బొల్లె శైలేశ్ అధ్యక్షతన జరిగిన మండల సమితి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ … సిపిఐ వందేళ్ళ ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో జరగనుందని, డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ముగింపు సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని తరలించాలన్నారు. ప్రజల్లో సీపీఐ చరిత్రను తెలిపేందుకు ఈ వందేండ్ల ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహింస్తున్నారని అన్నారు. ముగింపు సభకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిని తరలించేందుకు ప్రజలకు సీపీఐ చరిత్రను తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3జాతలు బయలుదేరతాయన్నారు.

నవంబరు 15 నుండి ప్రారంభమయ్యే ప్రచార జాతాలు రాష్ట్రవ్యాప్తంగా తిరగనున్నాయని, నల్గొండ జిల్లాలో 17 నుండి ప్రవేశిస్తుంది అన్నారు. ఈ జాతాకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బాల నరసింహ, సిపిఐ ఎమ్మెల్సీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం ఆధ్వర్యంలో జాత నవంబర్ 15న గద్వాల నుండి ప్రారంభమై 17న డిండికి చేరుతుందని తెలిపారు.ఖమ్మంలో జరిగే సిపిఐ నూరేళ్ళ ముగింపు బహిరంగ సభకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై లక్షలాది మందితో బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ గ్రామ శాఖలో సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని, గ్రామ శాఖలో ఉత్సాహవంతమైన నాయకత్వానికి నూతన బాధ్యతలు అప్పజెప్పాలని సూచించారు.

పార్టీని మండలంలో మరిన్ని శాఖలకు విస్తరించి పటిష్టంగా గ్రామ శాఖలను ఏర్పాటు చేయాలని, గ్రామ శాఖలో ప్రధానంగా మహిళలు, రైతులు, యువకులు, విద్యార్థులు భాగస్వామ్యం అయ్యేలా కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎండి.మైనోద్దీన్, సిపిఐ మండల కార్యదర్శి శ్రీ రామదాసు కనకాచారి, సహాయ కార్యదర్శి తిప్పర్తి విజయేందర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు రవీంద్ర శర్మ, ఎలిమినేటి హుస్సేన్, హనుమాన్ల కేశవులు, సోమిడి శ్రీనయ్య, నూనె వెంకటేశ్వర్లు, లచ్చయ్య, శాఖ కార్యదర్శులు శ్రీనివాస్ రెడ్డి, గొడుగు శ్రీను, శివ, చక్రి ఎఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి నవీన్, ఎఐఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షులు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -