Monday, July 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలునవతెలంగాణ పదో వార్షికోత్సవం: టీ.పీసీసీ ఉపాధ్యక్షులు వ‌జ్రేష్ యాద‌వ్‌కు ఆహ్వానం

నవతెలంగాణ పదో వార్షికోత్సవం: టీ.పీసీసీ ఉపాధ్యక్షులు వ‌జ్రేష్ యాద‌వ్‌కు ఆహ్వానం

- Advertisement -
  • వజ్రెష్ యాదవ్‌కు ఆహ్వాన పత్రిక అందించిన ఎడిటర్ రాంపల్లి రమేష్

నవతెలంగాణ-బోడుప్పల్: ప్రజల గొంతుకై ప్రతి నిత్యం ప్రజా సమస్యలే అజెండాగా ని చేస్తున్న ప్రజల పత్రిక “నవతెలంగాణ తెలుగు దిన పత్రిక” దశాబ్ది ఉత్సవాలకు రావాలని పత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్ కోరారు. ఈ మేరకు సోమవారం టీ.పీసీసీ ఉపాధ్యక్షుడు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జీ తోటకూర వజ్రెష్ యాదవ్ నివాసంలో జీఎం లింగారెడ్డి తో కలసి ఆయన నివాసంలో ఆహ్వాన పత్రిక అందించారు.

ఈ సందర్భంగా ఎడిటర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రతి నిత్యం ప్రజా సమస్యలపై తనదైన శైలిలో నిర్మించారు వార్తలు రాస్తూ అటి ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా ఉంటు పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు1న దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీపీఎం పోలిట్ బ్యూరో కమిటీ సభ్యులు బీవీ రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతారని తెలిపారు. ఆహ్వాన పత్రిక అందించిన వారిలో మేడ్చల్ కలెక్టరేట్ విలేఖరి బీ.యాదగిరి,స్థస్థానిక విలేఖరులు కల్కూరి ఎల్లయ్య, సాయికిరణ్,ఎడీవీటీ సిబ్బంది గోపి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -