Tuesday, July 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవిచారణకు రండి

విచారణకు రండి

- Advertisement -

– బెట్టింగ్‌ యాప్‌ కేసులో నలుగురు సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

బెట్టింగ్‌ యాప్‌ను ప్రమోషన్‌ చేసిన నలుగురు సినీ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు తాజాగా నోటీసులను జారీ చేశారు. వీరు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోషన్‌ చేయటం ద్వారా వీరికి హవాలా మార్గంలో పెద్దమొత్తంలో డబ్బులు అందాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న నటుడు రానా, 30న నటుడు ప్రకాశ్‌రాజ్‌లను తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొన్నది. అలాగే ఆగస్టు 6న నటుడు విజయ్‌ దేవరకొండను, 13న మంచు లక్ష్మిలను కూడా హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఇప్పటికే తెలుగు సినీపరిశ్రమకు చెందిన దాదాపు 20 మందికి పైగా సెలెబ్రిటీలకు బెట్టింగ్‌ యాప్‌లను ప్రోత్సహించిన కారణంగా వారికి హవాలా ద్వారా డబ్బులు అందాయని అనుమానిస్తున్న ఈడీ అధికారులు ఈ దిశగా దర్యాప్తును ముమ్మరం చేశారని తెలిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -