Thursday, March 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి  నష్టపరిహారం చెల్లించాలి

బస్వాపురం ప్రాజెక్టులో భూములు, ఇండ్లు కోల్పోయిన వారికి  నష్టపరిహారం చెల్లించాలి

- Advertisement -

-సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ….
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : బస్వాపురం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు, ఇండ్లు కోల్పోతున్న ప్రజలకు పూర్తిస్థాయి నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

గురువారం రాత్రి  భువనగిరి మండల పరిధిలోని బస్వాపురం గ్రామంలో సీపీఐ(ఎం) శాఖ సమావేశం నరాల చంద్రయ్య అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహ హాజరై, మాట్లాడారు.  తమ భూములను, వందలాది సంవత్సరాలుగా ఒక గ్రామంలో గూడును ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న ప్రజలు ఇతరుల అవసరాల కోసం, సాగునీరు కోసం సర్వం కోల్పోతూ ప్రాజెక్టు నిర్మాణానికి సర్వము అర్పించిన నేటికీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం ఇవ్వకపోవడం సిగ్గుచేటని అన్నారు. బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 20 సంవత్సరాలు గడుస్తున్న నిర్వాసితులకు నష్టపరిహారం, పునరావాసం అందించుటలో మాత్రం పాలకులు పూర్తిగా విఫలమైనారని విమర్శించారు. మరో పక్క పెండింగులో ఉన్న ప్రాజెక్టు నిర్మాణానికి రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి, నిర్వాసితులకు

 500 కోట్ల రూపాయలు కేటాయించి విడుదల చేయాలని నర్సింహ్మ కోరారు. ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, మండల కమిటీ సభ్యులు మధ్యపురం  బాల్ నరసింహ, శాఖ కార్యదర్శి మచ్చ భాస్కర్, సహాయ కార్యదర్శి రాసాల దేవేందర్, సభ్యులు ఉడుత విష్ణు, ఎండి. బాబు, ఉడత వెంకటేష్, ముదిగొండ కృష్ణ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -