Thursday, October 30, 2025
E-PAPER
Homeజిల్లాలుతుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి : సీపీఐ(ఎం)

తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంటలకు పరిహారం అందించాలి : సీపీఐ(ఎం)

- Advertisement -

ఎకరానికి 30 వేలు పరిహారం ఇవ్వాలి

నేలకొరిగిన పంటలను పరిశీలించిన జూలకంటి

నవతెలంగాణ మిర్యాలగూడ 

తుఫాను ప్రభావంతో నష్టపోయిన పంట పొలాలకు పరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మిర్యాలగూడ మండలంలోని గూడూరు గ్రామంలో నెలకొరిగిన వరి పంట పొలాలను పరిశీలించారు. రైతులను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముంతా తుఫాను వల్ల రైతులకు తీరని అన్యాయం జరిగిందని అవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయలు పెట్టుబడిన పెట్టీ పంటలు సాగు చేసుకుంటే ప్రకృతి వైపరీత్యాల రిత్యా పంటలు దెబ్బతిని రైతులకు ఆర్ధికంగా నష్టం తెచ్చిపెట్టిందన్నారు.

పాలు పోసుకొని గింజ గట్టి పడే సమయంలో ఈదురుగాలులు తుఫాను కారణంగా వరి పంటలన్నీ నేలకొరగాయని దీనివల్ల గింజలు రాలిపోయానే తెలిపారు. ఎకరానికి 30 నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టారని తీరా పంట చేతికి వచ్చిన సమయంలో తుఫాను కారణంగా పంట నాశనం అయిందని అవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపించి సర్వే నిర్వహించి నష్టపోయిన రైతుల వివరాలను సేకరించాలన్నారు.ఎకరానికి 30 వేల పరిహార అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి మూడవత్ రవి నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు

పిల్లుట్ల సైదులు గిరిజన సంఘం మండల అధ్యక్షులు రవీందర్ నాయక్ సిపిఎం శాఖ కార్యదర్శి సత్యనారాయణ మదావత్ శీను  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -