ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య డిమాండ్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజాంబాద్ జిల్లా కేంద్రంలో ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి లు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షానికి రైతాంగం వేసుకున్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని వారన్నారు. చెరుకు మొక్కజొన్న పత్తి సోయా పెసరి మినుములతో పాటు ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. భారీ వర్షాలకు 34 చెరువులు తెగడం గండ్లు పడడం జరిగిందని దీని మూలంగా గ్రామాలలో నీరు చేరి వందలాది పాత ఇల్లు గుడిసెలు రేకులు కూలిపోయాయి అన్నారు.
ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు వేసిన ప్రాథమిక అంచనా ప్రకారమే 21మండలలోని 48 వేల 429 ఎకరాల్లో పంట దెబ్బతిన్నాయని ఒక వెయ్యి 26 ఎకరాల్లో ఇసుకమెట్ట పెట్టిందని తెలిపారని అన్నారు. గోదావరి మంజీరా పరివాహ ప్రాంతాల్లో వరద ముప్పు వచ్చింది మందర్న, ఖాజాపూర్, అంగర్గా, బిక్ నెల్లి, కండుగాం, కందకుర్తి ,తాడ్ బీలోలి, నిజాంబాద్ రూరల్ లో సిరికొండ మండల కేంద్రంలో కొండూరు, గడ్కోలు, పెద్దవాల్గోట్,వాడి, బడా భీమ్గల్, గ్రామాలలో తీవ్ర నష్టం జరిగిందని ఆయన అన్నారు. రోడ్లు తెగిపోయి కరెంటు వైర్లు ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని నిజాంబాద్ జిల్లాలో అపార నష్టం జరిగిందని ఆయన అన్నారు.
ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి గ్రామాలలో యుద్ధ ప్రాతిపదిక పైన పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకరానికి 25 వేల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి వారి అప్పులను మాఫీ చేయాలని ఇతర పంటలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూలిన ఇ ళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయి రెడ్డి, విట్టల్, బి సాయిలు,బాబురావు, వేల్పూర్ గంగారాం,గంగాధర్ కె.గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
పంట నష్టపోయిన రైతంగానికి నష్టపరిహారం అందించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES