- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ రావు మండలం,ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం రాజయ్య లేగ దూడ ఇదే సంవత్సరం జూన్ 20న బొగ్గుల వాగు అటవీ సమీప ప్రాంతంలో పులి దాడిలో చనిపోగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను కొయ్యూరు అటవీ అధికారులు పంపగా భూపాలపల్లి ఎఫ్ డి ఓ అప్పలకొండ ఆధ్వర్యంలో మంజూరైన రూ.30 వేల పరిహారం చెక్కును కొయ్యూరు రేంజ్ అధికారి జి.రాజేశ్వరరావు, సెక్షన్ అధికారి ఎంఏ ఇంతియాజ్,బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు శనివారం బాధితుడికి అందించారు.
- Advertisement -