నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం కంప్లైంట్ బాక్స్ లను ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడారపు రాంప్రసాద్ తెలిపారు. బాలికా సాధికారత, కౌమార రక్షణ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఈవ్ టీజింగ్, ఇతర సమస్యలు, మధ్యాహ్నం భోజన పథకంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం కంప్లైంట్ బాక్స్ లను తెరిచి సమస్యలకు పరిష్కారం సూచించడం జరుగుతుందని ఆయన తెలిపారు. పాఠశాల స్థాయిలో పరిష్కరించే సమస్యలు సంబంధితుల తల్లిదండ్రులకు తెలిపి పరిష్కరించడం జరుగుతుందని, తీవ్రమైన సమస్యలు కమ్మర్ పల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు తమ పేర్లు రాయకుండా సమస్యలు రాసి రహస్యంగా బాక్స్ లో వేసే ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ధర్మేందర్, అరవింద్, గీత, హైమవతి, రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.
కోనాపూర్ ఉన్నత పాఠశాలలో కంప్లైంట్ బాక్స్ ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



