- Advertisement -
నవతెలంగాణ- హైదరాబాద్: బిగ్‌బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ పోలిస్ స్టెషన్‌లో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.
- Advertisement -