Monday, March 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణిలో ఫిర్యాదులు నిల్

ప్రజావాణిలో ఫిర్యాదులు నిల్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఫిర్యాదులు చేయడం లేదని నేటి ప్రజావాణిలో ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఎమ్మార్వో మారుతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించమని తెలిపారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము , ఉపాధి హామీ ఏపీవో తులసి రామ్ , ఐకెపిసిసి , రెవెన్యూ శాఖ అధికారులు మాత్రమే పాల్గొన్నారు. 

నిత్యం ప్రతి శనివారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఇతర శాఖల అధికారులు దుమ్మాలు కొంటున్నారని ప్రజలు అంటున్నారు. నేటి ప్రజావాణ కార్యక్రమానికి ముఖ్యమైన శాఖలైన విద్యుత్ శాఖ , పంచాయతీరాజ్ శాఖ , మిషన్ భగీరథ, రోడ్లు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ, అటవీ శాఖ, గురుకుల హాస్టల్ లో అధికారులు, బీసీ వెల్ఫేర్,  ఎస్టీ వెల్ఫేర్ , ఎస్సీ వెల్ఫేర్ , ఇతర శాఖల అధికారులు రావడం మానేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమస్యలను తెలియజేయాలంటే సంబంధిత శాఖ అధికారులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొంటేనే వాటి పరిష్కార మార్గాలు అక్కడే అందించవచ్చుని తెలిసిన అధికారులు రాకపోవడం వారి వీధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ప్రజావాణి కార్యక్రమాలకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -