- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
ఆరు నెలలు నిండిన పిల్లలకు అనుబంధ ఆహారం ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప అన్నారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా బుధవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేట వార్డులో అంగన్వాడీ సెంటర్ లో పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గర్భిణీలు, బాలింతలకు వివరించారు. అనంతరం పలువురు గర్భిణీలకు శ్రీమంతాలు, ఆరు నెలలు నిండిన చిన్నారులకు అన్నప్రాసన చేశారు. ఆ తర్వాత బతుకమ్మ ఆడారు. ఏఎన్ఎం పుష్ప, అంగన్వాడీ టీచర్లు పద్మ, ఎన్. విజయలక్ష్మి, కే. విజయలక్ష్మి, స్వరూప, ఆశాలు పలువురు పాల్గొన్నారు.
- Advertisement -