– వైద్యాధికారి డాక్టర్ రాందాస్
నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానికంగా లభ్యం అయ్యే ఆకు కూరలు,కూరగాయలు నాణ్యమైన ఆహార పదార్ధాలతో పౌష్టికాహారం లభిస్తుంది అని,మన చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో వ్యక్తిగత శుభ్రత, పరిశుభ్రత లే సంపూర్ణ ఆరోగ్యాన్ని జేకూర్చుతాయని వినాయక పురం ప్రభుత్వం ప్రాధమిక ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ రాందాస్ అన్నారు.
ఐసీడీఎస్ ఆద్వర్యంలో “స్వస్థ్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్” 8 వ జాతీయ పోషణ మాస ప్రారంభోత్సవ సందర్బంగా శుక్రవారం మండల పరిధిలోని వినాయక పురం పీహెచ్ సీ లో గర్భవతులకు,బాలింతలకు,మహిళలకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు.ఇందులో పిల్లల తల్లులకు,తండ్రులకు పౌష్టికాహారం,ఆహారం శుభ్రత ల పై డాక్టర్ రాందాస్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ముత్తమ్మ,ఏసీడీపీఓ అలేఖ్య,సూపర్వైజర్ లు సౌజన్య,పద్మావతి,వరలక్ష్మి లు పాల్గొన్నారు.