Monday, August 11, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంరసూల్‌పుర ఫ్లైఓవర్‌కు భూసేకరణ పూర్తి చేయండి

రసూల్‌పుర ఫ్లైఓవర్‌కు భూసేకరణ పూర్తి చేయండి

- Advertisement -

– జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ.కర్ణన్‌
– సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనుల పరిశీలన
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని రసూల్‌పుర ఫ్లైఓవర్‌ నిర్మాణానికి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో కమిషనర్‌ గురువారం సికింద్రాబాద్‌ జోన్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న బస్‌ స్టాప్‌లను పరిశీలించారు. రైల్వే సరిహద్దు నుంచి 24 మీటర్ల వరకు భూమి అవసరం ఉందని అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు. బస్‌స్టాప్‌కు ప్రత్యామ్నాయ భూమిని కేటాయించి దానిని తరలించాల్సిన అవసరం ఉందని ప్రాజెక్ట్‌ ఎస్‌ఇ.శ్రీనివాస్‌ కమిషనర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ హెచ్‌ సిటీ ద్వారా రసూల్‌పుర వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్‌ నిర్మాణ స్థలాన్ని వెంటనే పరిశీలించి భూసేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img