- Advertisement -
నవతెలంగాణ – అచ్చంపేట
రాజీమార్గంలో కేసులు పరిష్కరించుకోవాలని అచ్చంపేట జూనియర్ సివి జడ్జి స్పందన అన్నారు. బుధవారం కోర్టు ఆవరణలో పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసులు అచ్చంపేట సీఐ నాగరాజు అమ్రాబాద్ సిఐ శంకర్ నాయక్ వివిధ పోలీస్ స్టేషన్లో ఎస్ఐలు కోర్టు సిబ్బంది ఉన్నారు.
- Advertisement -