నవతెలంగాణ-పెద్దవూర
నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియా మున్సిపాలిటీ కేంద్రం లోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాలలలో ఏకే ఫౌండేషన్, విధ్యేధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా బంధు కార్యక్రమంలో భాగంగాశనివారం అచెరాన్ సాఫ్ట్వేర్ కన్సుల్టేన్సీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో విద్యార్థులకి డిజిటల్ క్లాసెస్ ఉపయోగార్ధం 15 కంప్యూటర్ మానిటర్స్ ను ఏకే పౌండేషన్ ఛైర్మెన్,హైకోర్టు న్యాయవాది కట్టేబోయిన అనిల్ అన్న
పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ నేడు ప్రతి రంగం కంప్యూటర్ తో ముడిపడి ఉందని,విద్యార్థుల కంప్యూటర్ స్కిల్స్ పెంపోందించికొని, కష్టపడి చదివి ఉన్నత స్థానాలకి చేరుకోవాలని కోరారు.విధ్యేధన్ ఫౌండేషన్ సెక్రటరీ బుర్ల హరిత మాట్లాడుతూ బాలికలకి సాఫ్ట్వేర్ రంగం లో అవకాశలు మెండుగా ఉన్నాయనిగోల్ ఒరియాంటెడ్ గా చదవితే భవిష్యత్ లో సాఫ్ట్వేర్ రంగం లో ఉద్యోగాలు సాధించోచ్చు అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కుకడాల హైమావతి, పాఠశాల ఉపాధ్యాయుల, విధ్యేధన్ ఫౌండేషన్ మెంబర్స్ ఆశీష్, వాగ్దేవి, తనిష్కా, ఏకే ఫౌండేషన్ మెంబర్స్ మన్నెం కోటి, రావుల రాము యాదవ్, శేఖర్ గౌడ్, గంగుల అంజి యాదవ్, బొమ్మిశెట్టి రామలింగయ్య, పులి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
కస్తూర్భా గాంధీ పాఠశాలలో కంప్యూటర్ మానిటర్స్ బహుకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



