Sunday, August 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలునకిలీ పత్రాలు సృష్టిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు 

నకిలీ పత్రాలు సృష్టిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు 

- Advertisement -

– ఒకరు ప్రసవిస్తే, మరొకరి పేరుపై మీ సేవలో దరఖాస్తు 
– జిజిహెచ్ లో ఆఫ్ లైన్లో ఒకరి పేరు, ఆన్ లైన్లో మరొకరి  పేరు 
– మీ సేవలో అడ్డగోలుగా తప్పుడు దరఖాస్తులు 
– కనీసం పరిశీలించకుండానే జనన ధ్రువపత్రాలు జారీ
– దానిని అనుకరిస్తున్న మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్ 
– ఎవరి వాటా ఎంత తేల్చాల్సింది కలెక్టరే 
– అధికారుల పర్యవేక్షణ కరువు 
నవతెలంగాణ –  కామారెడ్డి 

కంప్యూటర్ ఆపరేటర్లు తమ ఇష్టరీతిగా వ్యవహరిస్తూ తప్పుడు ధ్రువపత్రాలను  సృష్టిస్తున్నారు. కనీసం మీసేవ వారు ఏ పత్రాలు పెట్టి దరఖాస్తు చేశారో పరిశీలించకుండానే మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్లు జనన ధ్రువపత్రాలు జారీ చేస్తున్నారు. మార్చ్ 16వ తేదీన లింగంపేట మండలం, లింగంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మాధవి అనే మహిళ కామారెడ్డి జిజిహెచ్ ఆసుపత్రిలో ప్రసవానికి రాగా మార్చి 17 నా ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన మొదటి రెండు రోజుల్లోనే ఆ పసికందును వేరే వారికి ఇవ్వడంతో ఆ కుమ్మరి మాధవి తాను ఏం మాట్లాడుతుందో తనకే తెలియకుండా పోయింది.

ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగా ఆడ పసికందును తీసుకువెళ్లిన సంబంధిత వ్యక్తులు జనన ధ్రువీకరణ పత్రం కోసం పలు అవుక తావుకలకు పాల్పడ్డారు. ఆస్పత్రిలో కుమ్మరి మాధవి ఆడపిల్లకు జన్మనివ్వగా ఆమె భర్త కుమ్మరి సాయిలు కాగా వారు మాత్రం కుమ్మరి మాధవి భర్త స్థానంలో బింగి సాయిలుగా జనన ధ్రువీకరణ పత్రాన్ని కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ అధికారులు జారీ చేశారు.
మీసేవ నుండి తప్పుడు దరఖాస్తు..
మొదటగా కుమ్మరి మాధవి భర్త కుమ్మరి సాయిల్ గా రాగా దానిని పూర్తిగా మార్చి వేయాలని ఉద్దేశంతో ప్రసవించింది బింగి కవిత అని భర్త పేరు బింగి రాజు అని, మీసేవ దరఖాస్తు ఫామ్ లో పూర్తిచేసి ఆధార్ కార్డు సైతం కుమ్మరి మాధవి కాకుండా బింగి కవితది మీ సేవలో అప్లోడ్ చేశారు. బింగి కవిత బింగి రాజు అనే వ్యక్తులది కామారెడ్డి జిల్లా కాదు వారి తూప్రాన్, అంతవరకు బాగానే ఉన్నా సంబంధిత మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్లు గుడ్డిగా ఎలాంటిది పరిశీలించకుండానే జనన ధ్రువీకరణ పత్రంపై తల్లి పేరు కుమ్మరి మాధవిగా ఉంచుతూ.. తండ్రి పేరు మాత్రం బింగి సాయిలుగా జారీ చేశారు. 
సమాచార హక్కు చట్టంతో వెలుగులోకి…
లింగంపేట్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి మాధవి అనే మహిళ తన భర్తతో వేరుగా ఉంటూ సుమారు మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది. వారి ఇరువురి డేకుల కేసు కోర్టులో కొనసాగుతోంది. ఆ క్రమంలోనే ఆమె  గర్భం దాల్చడం ఆడపిల్లలకు జన్మనివ్వడం,  ఆ తర్వాత ఆమెకు కూతురు పుట్టిందని విషయం తెలుసుకున్న భర్త మనోవేదనకు గురై పూర్తి సమాచారాన్ని సేకరించగా ఆమె ప్రసవించగానే ఆ పసి గుడ్డును విక్రయించినట్లుగా తెలుసుకొని పూర్తి సమాచారం కోసం తిరుగుతున్న క్రమంలో సమాచార చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
పసికందు విక్రయం జరిగింది అని తెలిసినా పట్టించుకోని జిల్లా అధికారులు 
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మార్చి 13న జిజిహెచ్ లో జన్మించిన ఆడ పసికందు విక్రయం జరిగిందని తెలిసిన జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారి పట్టించుకోలేదని బాధితుడు వాపోతున్నాడు. వారు మాత్రం తమకు ఫిర్యాదు వస్తేనే పట్టించుకుంటామని ఫిర్యాదు రాకపోతే పట్టించుకోమని సంబంధిత చైల్డ్ వెల్ఫేర్ అధికారి అన్నారని బాధితుడు పేర్కొంటున్నాడు.
ఆ మీ సేవపై చర్యలు తీసుకోవాలి…
ఇలాంటి తప్పుడు దరఖాస్తులు చేస్తున్న  ఆ మీసేవపై చర్యలు తీసుకోవాలని పలువురు పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో కలెక్టర్ చొరవ తీసుకొని ఇంటలిజెన్స్ అధికారుల ద్వారా ఆ మీసేవ ఇప్పటివరకు జనన ధ్రువీకరణ పత్రాలు కానీ మరి ఏ పత్రాల కోసం దరఖాస్తు చేసింద విచారణ జరిపించి. మీసేవపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
మాధవి భర్త కుమ్మరి సాయిలు ఆవేదన..  
తాను ఇంట్లో ఉండి వ్యవసాయం ఇతరత్రా పనులు చేసుకుంటూ గుట్టుగా సంసారం చేసుకునే వ్యక్తిని అని  అలాంటిది  నా భార్య నాకు దూరంగా ఉండి ఒక పాపకు జన్మనిచ్చిందని తెలుసుకొని న్యాయం జరుగుతుందని వెళ్లితే అధికారులు అన్యాయానికే వంత పాడుతున్నారు. ఆ పుట్టిన పాప ఎక్కడుందో ఇంతవరకు తెలియదు. అధికారికంగా మాత్రం బింగి సాయిలుని నివాస తూప్రానని అధికారులు ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేశారు.

సామాన్యునికి న్యాయం జరుగుతుందని ఇప్పటికి నమ్ముతున్నాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. బాలల సంరక్షణ అధికారి దగ్గరికి వెళ్లితే నీవు పోలీస్ స్టేషన్ కు వెళ్లి దరఖాస్తు చేయాలని చెప్పడంతో  నేను పోలీస్ స్టేషన్  వెళ్లగా ఎస్సై నీ దరఖాస్తు చెల్లందంటూ పంపించాడని, ఆ తర్వాత బాలల సంరక్షణ అధికారి తనకు లిఖితపూర్వకంగా ఇస్తేనే తాను ఇంక్వైరీ చేయడం జరుగుతుందని లేకపోతే లేదని, ప్రస్తుతం ఆ మాధవి వద్ద ఆ పాప లేదని ఈ విషయం గ్రామంలో అందరికీ తెలుసని అయినప్పటికీ జిల్లా అధికారి ఈ విషయంలో పట్టించుకోవడం లేదని అవేదన చెందాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -