Wednesday, July 30, 2025
E-PAPER
Homeజిల్లాలుఅనారోగ్యంతో కామ్రేడ్ పెద్ది విజయదుర్గ కన్నుమూత

అనారోగ్యంతో కామ్రేడ్ పెద్ది విజయదుర్గ కన్నుమూత

- Advertisement -

రేపు అంతిమయాత్ర, ప్రభుత్వ మెడికల్ కళాశాల విద్యార్థులకు పార్తివదేహం అందజేత
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

సీపీఐ(ఎం) నిజామాబాద్ జిల్లా మాజీ కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్రాములు సతీమణి కామ్రేడ్ పెద్ది విజయదుర్గ మంగళవారం అనారోగ్యంతో కన్ను మూశారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, కామ్రేడ్ పెద్ది విజయదుర్గ మృతికి సంతాపం తెలియజేశారు. అలాగే సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు, సానుభూతిపరులు సైతం సానుభూతి వ్యక్తం చేశారు. రేపు అనగా బుధవారం స్వగృహం నుండి అంతిమయాత్ర ర్యాలీగా నిజామాబాద్ మెడికల్ కళాశాలకు చేరుకుంటుంది. అనంతరం పార్తివదేహాన్ని మెడికల్ కళాశాల విద్యార్థుల ప్రయోగాలకు అందజేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -