Thursday, January 8, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్‌లో తీవ్ర‌మైనా ఆందోళ‌న‌లు..

ఇరాన్‌లో తీవ్ర‌మైనా ఆందోళ‌న‌లు..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్‌లో భారీగా ఆ దేశ‌ క‌రెన్సీ విలువ‌ ప‌డిపోయి పెరిగిన జీవన వ్యయం కారణంగా ప్రజలు నిరసనబాట పట్టారు. ప‌లు రోజుల నుంచి ఆదేశ వాసులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో నిర‌స‌న‌లు ఉధృతం కావ‌డంతో చెదరగొట్టేందుకు భద్రతా దళాలు భాష్పవాయువుని ప్రయోగించడం, కాల్పులు జరపడం పరిపాటిగా మారింది. తాజాగా ఆందోళనకారులపై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మైనర్లతో 27 మంది చనిపోయినట్లు నార్వేకు చెందిన ఎన్‌జివో ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ పేర్కొంది. మంగళవారం కూడా టెహ్రాన్‌లో ఉన్న సినా హాస్పిటల్‌ పక్క వీధుల్లో జనసమూహాన్ని భద్రతా సిబ్బంది చెదరగొట్టారని ఇరాన్‌ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఇరాన్‌పై కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ జోక్యం పెరుగుతూనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -