Saturday, October 18, 2025
E-PAPER
Homeజిల్లాలుఅక్రమ అరెస్టులను ఖండించండి: సీపీఐ(ఎం) 

అక్రమ అరెస్టులను ఖండించండి: సీపీఐ(ఎం) 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చలో రాజభవన్ కార్యక్రమం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లాలో సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్ట్ ఖండించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ లపై బీజేపీ అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ఈరోజు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి,జిల్లా కమిటీ సభ్యులు ఉప్పేర్ నరసింహ, దరూర్ మండలంలో హమాలీ నర్సింహా,దేవదాసు,వడ్డేపల్లి మండలంలో  పరంజ్యోతి,సంజీవ రాజు, బీమన్న,ఉండవెల్లి మండలంలో ప్రాగటూరు మద్దిలేటి లను అక్రమంగా అరెస్ట్ చేసారని తెలిపారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కుల గణన చేయకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నదని విమర్శించారు. బీసీల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు.

సమస్యకు పరిష్కారాన్ని తన చేతిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించటం ఏమిటని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నదన్న సంగతి రాష్ట్ర బీజేపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.రాజ్యాంగ సవరణ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్  చేర్చేంత వరకు సీపీఐ(ఎం) కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేలా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో ఉద్యమాలను ఆపలేరని, బిసి రిజర్వేషన్ల కోసం పోరాటాలను ఇంకా ఉదృతం చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -