Friday, October 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దొడ్డ నారాయణరావు మృతికి సంతాపం

దొడ్డ నారాయణరావు మృతికి సంతాపం

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి 
ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి, తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధులు దొడ్డ నారాయణరావు చిలుకూరు మండల కేంద్రంలో రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కమిటీ సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. అలాగే చిలుకూరు ఎంపీపీగా జడ్పిటిసిగా అనేక ప్రజా సమస్యల పరిష్కారానికి నికరంగా కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన మరణం ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరనిలోటుని చెప్పారు. అనేక ప్రజా సమస్యలపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలుగా పోరాడమని గుర్తు చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీపీఐ(ఎం) నల్గొండ జిల్లా కమిటీ ప్రగాఢ సానుభూతి, తీవ్ర సంతాపం ప్రకటిస్తుందని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -