Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పూజారి సాంబయ్య కుటుంబానికి పరామర్శ.. 

పూజారి సాంబయ్య కుటుంబానికి పరామర్శ.. 

- Advertisement -

నవతెలంగాణ -పరకాల 
మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు పూజారి సాంబయ్య గౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. శనివారం పరకాల పట్టణంలోని పూజారి సాంబయ్య సాంబయ్య 9వ రోజు కార్యక్రమంలో రాజయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా సాంబయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వారి మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ, కుమారులు ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి, ఏంఏసి డైరెక్టర్ దాసరి బిక్షపతి, ఎస్సీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, మాజీ సర్పంచ్ ఇనగల రమేష్, మాజీ ఎంపిటిసి కొత్తపల్లి రవి, పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, కాంగ్రెస్ నాయకులు బొచ్చు మోహన్, బొచ్చు భాస్కర్, బొచ్చు జెమిని, దుప్పటి సదయ్య, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్యామ్, యూత్ నాయకులు మంద వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad