- Advertisement -
– ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) తెలంగాణ రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానితో పాటు అనేక మంది భారతీయులు, బ్రిటిష్ పౌరులు, ప్రమాద ఘటనలో వైద్యులు, సిబ్బంది మరణించడం బాధాకరమని ఐలు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విద్యాసాగర్, బార్ కౌన్సిల్ మెంబర్, రాష్ట్ర అధ్యక్షులు కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి కే.పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాద ఘటనలో మరణించిచన వారి బంధువులకు సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని కోరారు.
- Advertisement -