- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : నిర్మల్(D) భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న బస్సుఎక్కిన కొందరు మహిళలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ ఇవ్వమని కోరారు. కాగా ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు కండక్టర్ అభ్యంతరం తెలిపారు. తెలంగాణలో ఆధార్ ఉంటే జీరో టికెట్ ఇస్తామని చెప్పి వారిని బస్సు నుంచి దింపేశారు. అయితే ఇన్నాళ్లూ తాము పాత ఆధార్ తోనే ఉచితంగా ప్రయాణించామని, ఇప్పుడెందుకు అభ్యంతరం తెలుపుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -