Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాయపోల్ ఎస్ఐ మానసకు అభినందనలు

రాయపోల్ ఎస్ఐ మానసకు అభినందనలు

- Advertisement -
  • సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్

నవతెలంగాణ-రాయపోల్: రాయపోల్ పోలీస్ స్టేషన్ నూత‌నంగా ఎస్ఐ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ మానసను సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సై మాన‌స‌ను శాలువాతో సత్క‌రించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఐగా శిక్షణ పూర్తి చేసుకొని మొదటి పోస్ట్ రాయపోల్ మండలానికి వచ్చినందుకు అభినందనలు తెలియ‌జేశారు. ఎంతో మంది మహిళలకు ఆమె స్ఫూర్తిదాయకంగా నిలవాలని, మిమ్మలని ఆదర్శంగా తీసుకోని మహిళలు పోలీస్ ఉద్యోగాలు సాధించాలని ఆశాభావం వ్య‌క్తం చేశారు.ప్రజలందరి సమన్వయంతో ప్రజా సమస్యలను పరిష్కరించాలని, శాంతి భద్రతలు పరిరక్షణలో తామంత‌ సహకరిస్తామని భ‌రోసా క‌ల్పించారు.

అనంతరం ఎస్ఐ మానస మాట్లాడుతూ సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ తరపునా చేస్తున్న సామాజిక ప్రజా సేవా కార్యక్రమాలను తెలుసుకొని ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి సేవ చేసే ఆలోచన అందరికీ ఉండదని అలా ప్రజాసేవలో నడుస్తున్న మీకు త‌మ‌ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బుద్ధిష్టి సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు, సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పుట్ట రాజు, జర్నలిస్ట్ మన్నె గణేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -