Thursday, July 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు శుభాకాంక్షలు..

నూతన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కు శుభాకాంక్షలు..

- Advertisement -

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని హస్టల్ లో చదివే ప్రతి విద్యార్థి రక్షణ మన బాధ్యత అని బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో బీసీ సంక్షేమ కార్యాలయంలో జిల్లాకి కేటాయించిన నూతన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లని శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు హాస్టల్ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగాకుండా చూసుకోవాలని అన్నారు.

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని తెలిపారు.తల్లిదండ్రులు ఏ నమ్మకంతో విద్యార్థులను హాస్టల్లో వదిలినారో వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి అని ఆయన తెలిపారు. నూతనంగా ఎంపికైన హాస్టల్ వెల్ఫేర్ అధికారులు మంచిగా పని చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -