Wednesday, December 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలలో బుధవారం ఆర్మూర్ డివిజన్ స్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షత్రియ జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన టాలెంట్ టెస్టులో పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులు 11 మందికి మంచి ర్యాంకులు వచ్చాయన్నారు. దాదాపు 8 మండలాలు 42 పాఠశాలల నుండి 800 మంది విద్యార్థులు టాలెంట్ టెస్ట్ రాస్తే తమ పాఠశాల కు చెందిన 11 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించడం గర్వకారణం అన్నారు.

టాలెంట్ టెస్టులో మిసిమి పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎం.జయ శ్రీ, జె.షాలిని మంచి ప్రతిభ కనబరిచి తృతీయ స్థానాన్ని పొందినట్లు ఆయన తెలిపారు. తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు నిర్వాహకులు క్షత్రియ కళాశాలల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ చేతుల మీదుగా 15వేల  క్యాష్ ప్రైజ్ అందుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుధాకర్, వ్యాయామ  ఉపాధ్యాయులు సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -