-మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ గొంగిడి సునితామహేందర్ రెడ్డి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జీ గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట మండలం బాహుపేట ఆమె మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు వ్యతిరేకంగా ఓట్లు వేస్తారని అర్ధమై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను బెధిరిస్తూ, జైలు పాలు చేస్తామని, కోర్టుల చుట్టు తిపిస్తామని బెధిరింపులకు పాల్పడుతున్నారు. బాహూపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కవిడే మహేందర్ ను గత వారం రోజులుగా పార్టీ మారాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆయన వెనకాల ఇద్దరు పోలీసులను పెట్టారు.
అంతేకాకుండా సర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి వెళ్లి మహిళలను పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు. అధికార పార్టీ చెప్పినట్లు బీఆర్ఎస్ అభ్యర్దులపై పోలీసులు వ్యవహారిస్తే ఎలక్షన్ కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులతో కలిసి ఇబ్బందులు పెడుతున్నారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారి అయినా జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాం. ఆధికారంలో ఉన్న అహంకారంతో కాంగ్రెస్ వ్యవహారిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ లో ఏ మాత్రం తప్పు జరిగిన బాధ్యత కలెక్టర్, కాంగ్రెస్ పార్టీ వహించాలి. రెట్టింపు స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి బలం వచ్చింది. ఓడిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టే కాంగ్రెస్ ఇలా వ్యవహారిస్తుంది. ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి, ఇమ్మడి రాంరెడ్డి, కవిడ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.



