Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంఉపాధి హామీ పేరు మార్పు..దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌

ఉపాధి హామీ పేరు మార్పు..దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు పిలుపునిచ్చిన కాంగ్రెస్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఉపాధి హామీ స్కీమ్ పేరు మారుస్తూ బీజేపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల్లో భాగంగా లోక్ స‌భ‌లో మ‌హాత్మా గాంధీ రూర‌ల్ గ్యారంటీ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని(MGNREGA)..విక‌సిత్ భార‌త్ రోజ్‌గార్ అజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు-2025 VB-G RAM-G అని పేరు మారుస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ తో పాటు విప‌క్షాలు త‌ప్పుప‌ట్టాయి. అధికార బ‌లంతో బీజేపీ మితిమీరి వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని విప‌క్షాలు మండిప‌డ్డాయి. మోడీ స‌ర్కార్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బిజెపి-ఆర్ఎస్ఎస్ “హక్కుల ఆధారిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి” దానిని కేంద్రం నుండి నియంత్రించబడే దాతృత్వ కార్యక్రమాలతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయ‌ని ఆరోపించింది. గాంధీ ఆన‌వాళ్ల‌ను, ఆయ‌న పేరును శాశ్వ‌తంగా తుడిచివేయాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోందని కాంగ్రెస్ విమ‌ర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -