ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ గడపగడపకు సుగుణమ్మ
నవతెలంగాణ – చండూరు
మండలంలోని బోడంగి పర్తి గ్రామంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం ఆదివారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి బొమ్మల సుగుణమ్మ శంకరయ్య గ్రామంలో సీనియర్ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బంతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో ప్రజలు ఆశించిన అభివృద్ధిని గ్రామంలో అమలు చేస్తామన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సుజావుద్దీన్, తోటకూరి వెంకన్న వరికుప్పల ఇద్దయ్య, వర్కల లింగయ్య, గాలి బిక్షమయ్య, చనగాని వెంకన్న, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



