Monday, December 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారీ ర్యాలీతో నామీనేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమావత్ ప్రమీల శ్రీకాంత్

భారీ ర్యాలీతో నామీనేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి రమావత్ ప్రమీల శ్రీకాంత్

- Advertisement -

– గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తా..
నవతెలంగాణ – పెద్దవూర
స్థానిక సంస్థల రెండవ విడత నామినేషన్లలో భాగంగా సోమవారం మండలం లోని పులిచర్ల గ్రామంలో రమావత్ ప్రమీల శ్రీకాంత్ కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు గడ్డంపల్లి వినయ్ రెడ్డి, మాజీ ఎం పీపీ శంకర్ నాయక్ తో కలిసి కాంగ్రెస్ శ్రేణుల భారీ ర్యాలీ గా తరలి వెళ్లి నామీ నేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ .. అందుబాటులో ఉండి గ్రామంలో సమస్యలన్నీ నిజాయితీగా బాధ్యతగా పరిష్కరిస్తామన్నారు. గ్రామంలో అందరికి అందుబాటులో ఉంటూ సమస్యల సాధనకు కృషి చేస్తామన్నారు. ఈ నెల 14 న జరుగునున్న ఎన్నికలో మీరు మీ ఓటు ద్వారా నన్ను ఆశీర్వదిస్థారని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. మన గ్రామం అభివృద్ధి కోసం నిధులు తీసుకోస్థానని, అవి సక్రమంగా ఖర్చుచేసి బాద్యతగా పని చేస్తానని తెలిపారు. గ్రామ సభలు నిర్వహించి సమస్యలు ప్రజల ద్వారా తెలుసుకొని పరిష్కరిస్థానని చెప్పారు. అణునిత్యం అందుబాటులో ఉండి ఒక సేవకుడిగా పని చేస్తానని కోరారు. ఓటు వేసే ముందు ఒకసారి ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంద్రకంటి వెంకట్ రెడ్డి,బీరెడ్డి బాల్ రెడ్డి,సన్నపు రెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు,యువకులు,మహిళలు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -