నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి,డిసిసి జీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ప్రజలను కోరారు. రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఆదివారం మండలంలోని కొండంపేట, ఎడ్లపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు బెల్లంకొండ జ్యోత్స్న-సరిన్ రావు, జంగిడి శ్రీనివాస్, కోడారి చినమల్లయ్య ల పక్షాన విస్తృతంగా ప్రచారం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ బలపర్షిన అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబల్స్ గా ఎన్నికల్లో పోటీ చెసిన వారిని అధిష్టానం ఆదేశాల పార్టీ నుంచి పక్కన పెడుతున్నట్లుగా ప్రకటించారు. కొండంపేట నుంచి ఏనుగు నాగరాని-లక్ష్మీ నారాయణ, ఎడ్లపల్లి నుంచి జంగిడి సమ్మయ్య, ఇప్పలపల్లి నుంచి అబ్బినేని లింగస్వామిలను పార్టీ నుంచి పక్కన పెట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులు, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలని అందిస్తోందన్నారు. బీఆర్ఎస్, బిజెపి, స్వతంత్ర అభ్యర్థులకు ఓటు వేస్తే వృధావుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చల్లా మల్లారెడ్డి తోపాటు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



