పాల్గొన్న ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
నకిలీ, దొంగిలించిన ఓట్లతో బీజేపీ అధికారం చేపట్టిందని, ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగంగా ఆధారాలతో నిరూపించిన క్రమంలో ఆ పార్టీ నేతలను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ జాతీయ కమిటి పిలుపు మేరకు శనివారం స్థానిక పార్టీ శ్రేణులు జూపల్లి రమేష్ నేతృత్వంలో పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ.. మనల్ని మనమే రక్షించుకునే సమయం ఆసన్నం అయిందని అన్నారు. ఇందుకోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు తనిఖి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మ రాంబాబు, నార్లపాటి రాములు, తగరం ముత్తయ్య, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.
ఓట్ చోర్ – గద్దె చోడ్ నినాదంతో కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES