Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజల దృష్టి మరల్చడానికే కాలేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర: మాజీ ఎమ్మెల్యే షిండే

ప్రజల దృష్టి మరల్చడానికే కాలేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర: మాజీ ఎమ్మెల్యే షిండే

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చడానికే కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే అన్నారు. కెసిఆర్ పై కుట్ర రాజకీయాలు మానుకోవాలని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మద్నూర్ మండల కేంద్రంలో పాత బస్టాండు సమీపంలో బిఆర్ఎస్ పార్టీ మద్నూర్ ఉమ్మడి మండలంలోని మద్నూర్ డోంగ్లి మండలాల నాయకులతో రోడ్డుపై బైఠాయించి ధర్నా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షిండే మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని వాటిని నెరవేర్చ లేదని మండిపడ్డారు.

అసెంబ్లీలో ఒకరోజు సమావేశం నిర్వహిస్తే భారీ వర్షాలకు పంట నష్టం కొట్టుకపోయినా దెబ్బ తిన్న రోడ్లపై చర్చిస్తారని అందరూ అనుకున్నారని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సమస్యలపై సమావేశం జరపకుండా కాలేశ్వరం ప్రాజెక్టుపై కుట్ర సమావేశం నిర్వహించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సీబీఐకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతున్నారని జనజీవనం స్తంభించి పోతున్నదని తెలిపారు. వేల ఎకరాల్లో పంటలు నీట మునిగి, పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై అనవసర రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. కెసిఆర్ పై సిబిఐ విచారణకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ధర్నాకు మద్నూర్, డోంగ్లి ,మండలాలకు చెందిన బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, విజయ్ పటేల్, పార్టీ ఉమ్మడి మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్, మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ యువ నాయకులు మారుతి ఉమ్మడి మండలంలోని మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad