నవతెలంగాణ – మద్నూర్
వరి ధాన్యం పండించే రైతులకు మద్దతు ధర కల్పించడమే కాకుండా క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనని మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్ అన్నారు. డోంగ్లి మండలంలోని ఇలేగావ్, మాదన్ చిప్పర్గా, సిర్పూర్, గ్రామాల్లో మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు ఆయన ప్రారంభించారు. ఈ కొనుగోలు డోంగ్లి సహకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. వరి ధాన్యం మద్దతు ధర కొనుగోళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ మండల ప్రత్యేక అధికారి ఆ మండల తాసిల్దార్ డిప్యూటీ తాసిల్దార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానన్ దేశాయ, మాదన్, ఇప్పర్ గా గ్రామ సర్పంచ్ బాచావార్, లక్ష్మణ్ ఇలేగావ్ సర్పంచ్ జూవైదు పటేల్, సిర్పూర్ గ్రామ సర్పంచ్ గజానంద్, పటేల్ డోంగ్లి, సహకార సంఘం పర్సన్, ఇంచార్జ్ అదేవిధంగా డోంగ్లి సహకార సంఘం సెక్రెటరీ బాబురావు, ఆయా గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఏ ఈ ఓ లు గ్రామ కార్యదర్శులు, వరి ధాన్యం రైతులు పాల్గొన్నారు.
వరి ధాన్యం రైతులకు బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



