- Advertisement -
నవతెలంగాణ – కొత్తూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని మరిచిందని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన పలు కాలనీలో పర్యటించి బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈనెల 4న సోమాజిగూడ డివిజన్ లో జరిగే కేటీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలని జరిగిన సమీక్ష సమావేశంలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన కేటీఆర్ రోడ్ షో విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
- Advertisement -



