Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -

కాటారంలో రూ.35 కోట్లతో ఏటిసి కళాశాల
రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు

ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కాటారం లోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను రూ. 35 కోట్లతోని ప్రారంభించడం జరిగిందన్నారు.మంథని మండలంలో కూడా ఏటిసి- అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను చదువుకున్న విద్యార్థి విద్యార్థులకు పరిశ్రమలకు ఉపయోగపడేటట్టుగా రూ.45 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించబోతున్నామన్నారు.ఏటిసిలో చదువుతున్న ఆ సంవత్సరం కాలం పాటు విద్యార్థి, విద్యార్థినులకు ప్రతినెల రూ.2వేలు స్టైఫెండ్ కూడా డిక్లేర్ చేయడం జరిగిందన్నారు.స్టైఫెండ్ డిక్లేర్ చేస్తూ వారందరికీ కూడా సరిగ్గా చదువుకుని పూర్తిస్థాయిలో అర్హత ఉంటే అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందన్నారు.అందుకే ఏటిసి ఉండాలని కృత నిశ్చయంతో తీసుకురావడం జరిగిందన్నారు.ఇక్కడ ఉన్న యువతకి మార్గం చూపేందుకు ఇక్కడ ఏటిసి కళాశాలను ఏర్పాటు చేసుకోబోతున్నామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -