Thursday, December 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ప్రజాసంక్షేమాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గ్రామ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు పొదిళ్ళ శ్రీనివాస్ అన్నారు. గురువారం సర్పంచ్ ఎన్నికల్లో బాగంగా మండలంలోని పోతునూరు గ్రామంలో బీఆర్ ఎస్ సర్పంచి అభ్యర్థి పెండ్యాల సంతోష్ రావు,వార్డు మెంబర్ల తో కలిసి బిఆర్ ఎస్ బలపరిచిన  సర్పంచి,వార్డు మెంబర్ల ను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తి అయినా అమలు కానీ హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదని అన్నారు. ప్రజా సంక్షేమం పట్టని కాంగ్రెస్ వారికి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు.ప్రభుత్వం హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదని అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ సర్పంచిని, వార్డు అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు. సర్పంచి అభ్యర్థి పెండ్యాల సంతోష్ రావు మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాను. స్వచ్చమైన గ్రామం కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తాను.ప్రతి రోజూ నీటి సరఫరా కోసం చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల నిర్వహణను పర్యవేక్షిస్తూ ఇబ్బందులు రాకుండా చూస్తాను. గ్రామంలోని ప్రతి వీధికి సీసీ రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కు కృషి చేస్తాను. వృద్ధులకు, దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలు ప్రాధాన్యతతో అందేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పొనుగోటి వెంకటేశ్వర్ రావు,టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ముత్యాల యాదగిరి, పెండ్యాల కొండల్ రావు,వెంకటేశ్వర్లు,నారాయణరెడ్డి,శంకర్ రెడ్డి,
లింగారెడ్డి, చంద్రయ్య, దున్న వెంకటయ్య, జనార్ధన్ రావు, తరి వెంకటయ్య, పెండ్యాల అరుణమ్మ పూర్ణచందర్ రావు, తుమ్మ శ్రీనివాస్, శశిపాల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -