Thursday, October 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసంక్షేమంలో కాంగ్రెస్‌ విఫలం

సంక్షేమంలో కాంగ్రెస్‌ విఫలం

- Advertisement -

– హామీలు అమలు చేస్తేనే ప్రజల ఆదరణ
– కూలీలకు ఇస్తామన్న రూ.12వేలు వెంటనే చెల్లించాలి
– ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌. వెంకట్రాములు అన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో ఏడాదికి రూ.12వేలు ఇస్తామని మోసం చేశారని విమర్శించారు. బుధవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో వ్యకాస జిల్లా అధ్యక్షులు జగన్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో పారదర్శకత లోపిస్తుందని అన్నారు. ఇండ్లు లేని ప్రతి పేదోడికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ జాగాలో ఇంటి కోసం 120 గజాల స్థలం ఇవ్వాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాజ్‌ యోజన కింద పేదల ఇండ్ల కోసం రూ.10లక్షలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న కూలీలకు రెండు, మూడు నెలలైనా కూలీ డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కూలి రేట్లు రూ.600కు పెంచాలని, ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ అధికారంలోకి రాకముందే నిషేదించిన ఆర్‌ఎస్‌ఎస్‌ నేడు నీతి వాక్యాలు పలకడం ఈ దేశ ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయమూర్తిని గౌరవించాల్సింది పోయి ఆయనపైకి చెప్పు విసరడం వారి నైతికతకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి కడియాల మోహన్‌, ఉపాధ్యక్షులు హన్మంతు, ఎం.రాములు, సహాయ కార్యదర్శి పాండు, మహిళా కూలీల జిల్లా కన్వీనర్‌ శివలీల, నాయకులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -