Sunday, December 14, 2025
E-PAPER
Homeజాతీయంఓట్ చోరీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ

ఓట్ చోరీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ భారీ ర్యాలీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఓటు చోరీ పై కాంగ్రెస్ త‌న పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హిస్తున్న ఎస్ఐఆర్ ప్ర‌క్రియ‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తోంది. స‌ర్ పేరుతో ల‌క్ష‌ల సంఖ్య‌ల్లో ఓట‌ర్ల‌ను తొల‌గిస్తున్నార‌ని, ప్ర‌జాస్వామ్య‌ హ‌క్కును కాల‌రాస్తున్నార‌ని ప్ర‌తిపక్ష‌నేత రాహుల్ గాంధీ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ఓట్ల స‌వ‌ర‌ణ పేరుతో బీజేపీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం మ‌ద్ద‌తుగా వ్య‌వ‌హరిస్తోందని ఆరోపించిన విష‌యం తెలిసిందే. తాజాగా మ‌రో మారు ఓట్ చోరికి వ్య‌తిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశ ప్రజలంతా సంఘటితం కావాలని పిలుపునిస్తూ ఈ ర్యాలీని చేపట్టారు. ఈ ర్యాలీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ప్రారంభం కానుంది. ర్యాలీకి ముందు ఇందిరా భవన్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. అనంతరం అక్కడి నుంచి నేతలంతా నేరుగా రామ్‌లీలా మైదాన్‌కు చేరుకోనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -