- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రెండో విడత గ్రామా పంచాయాతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే హవా కొనసాగింది. మొత్తం 4,331 స్థానాల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని 2,300కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 1,100+, బీజేపీ 250+, ఇతరులు 480+ స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 46.7 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా భువనగిరి(91.2%), అత్యల్పంగా నిజామాబాద్(76.71%)లో పోలింగ్ నమోదైంది.
- Advertisement -



