– ఆరు నెలలుగా విద్యార్థులు ఆందోళనలు
– విద్యార్థుల గోస వినిపించుకొని సీఎం రేవంత్ రెడ్డి
– ఫీజు రీయంబర్స్, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని
– ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంత్రుల నివాసాల ముట్టడి
– పోలీసులు విద్యార్థులకు మద్య తీవ్ర తోపులాట
– విద్యార్ధి నాయకులు అరెస్టు, పలువురికి గాయాలు
– అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లు కు తరలింపు
– నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
నవతెలంగాణ హైదరాబాద్: రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలని, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నేడు జిల్లా కలెక్టరేట్స్, జిల్లా కేంద్రాల్లో భారీ ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా హైదరాబాద్ లోని “మంత్రుల నివాసాల ముట్టడి” కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ చేసింది. ఈ సందర్భంగా తమ సమస్యలు మంత్రులకు చెప్పెందుకు వెళ్తున్న విద్యార్ధి నేతలను పోలీసులు అడ్డుకోని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తీవ్ర తోపులాట విద్యార్ధులకు, పోలీసులకు మద్య జరిగింది. ఈ తోపులాటలో విద్యార్ధి నాయకులు తీవ్రంగా గాయపడ్డారు, పలువురు చోక్కాలను చింపి పోలీసులు విద్యార్ధి నాయకులపై దాడి చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రజనీకాంత్ మాట్లాడుతూ… రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి సుమారు 8,158 కోట్లు పెండింగ్ ఫీజులు బకాయిలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం విడుదల చేయడం లేదు. ఫీజులను విడుదల చేయకపోవడం వల్లన విద్యార్ధులు సర్టీఫికేట్స్ యాజమాన్యాలు ఇవ్వడం లేదని ,దీనివల్ల పై చదువులకు వెళ్ళలేక పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో గత 9 నెలలుగా గురుకులాలు, కెజిబివిలు, ఆశ్రమ పాఠశాలలు మెస్,కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి. వాటిని విడుదల చేయడం లేదన్నారు. కెజిబివిలు, ఎస్సీ గురుకులాలలో యూనిఫామ్, టెక్ట్స్ బుక్స్ పూర్తిస్థాయిలో అందించలేదని పుస్తకాలు లేకుండా పాఠాలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గత 20నెలలుగా లేరని, విద్యార్థులు చనిపోయిన, సమస్యలు వచ్చిన కనీసం విద్యారంగాన్ని పట్టించుకోకునే నాథుడే లేడని అన్నారు.
బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు, యూనివర్శీటీల నిధులు బకాయిలు, పాఠశాల అభివృద్ధి కోసం మన ఊరు మనబడి బకాయిలు ఇలా సమస్తం బకాయిలు విద్యలో ఉన్నాయని తెలిపారు. తక్షణ చర్యలు తీసుకుని ప్రభుత్వం యాజామన్యాలు విద్యార్థులు దగ్గర నుండి ఫీజులను వసూళ్లు చేయకుండా నిర్ణయం తీసుకోవాలని, ప్రత్యేక జీ.వో. తీసుకుని రావాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధి నాయకులపై పోలీసులు కర్కశంగా వ్యహరించి చోక్కాలను చింపివేశారు. అనంతరం విద్యార్థులను అరెస్ట్ చేసి బొల్లారం, కార్కనా, బోయినపల్లి, తిరుమల గిరి పోలీసు స్టేషన్లుకు తరలించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు, కార్తీక్, కె.వై. ప్రణయ్, లెనిన్ గువేరా, అవినాష్, జె.రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు శ్రీమాన్, స్టాలిన్, భగత్ మేడ్చల్, రంగారెడ్డి జిల్లా నాయకులు శ్రీకాంత్, తరంగ్, అరుణ్, శివ,లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.