Thursday, July 31, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేటి నుంచి కాంగ్రెస్‌ పాదయాత్ర

నేటి నుంచి కాంగ్రెస్‌ పాదయాత్ర

- Advertisement -

పరిగి నుంచి ప్రారంభం
ఆగస్టు 5, 6,7 తేదీల్లోఢిల్లీలో ఆందోళనలు
సీఎంతో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ భేటీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

పార్టీ సంస్థాగత అంశాలు, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై కార్యాచరణను ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌ భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో వారు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరపాటు సుదీర్ఘంగా చర్చించారు. గురువారం నుంచి ఆగస్టు 4 వరకు పాదయాత్ర, శ్రమదాన కార్యక్రమం యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభమై… ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ వరకు యాత్ర సాగనుంది. మరోవైపు 42శాతం బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీ వేదికగా ఉద్యమించేందుకు కార్యాచరణ ప్రకటించారు. ఆగస్టు 5, 6,7 తేదీత్లో ఢిల్లీలో మకాం వేసి కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. ఢిల్లీలో జరగనున్న ధర్నాకు ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ప్రత్యేక రైల్లో హస్తినకు పయనం కానున్నారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు.
కార్యాచరణ
– ఆగస్టు 5న లోక్‌సభ, రాజ్యసభల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఎంపీీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుపట్టడం
– 6న జంతర్‌ మంతర్‌ వద్ద మహాధర్నా
– 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేయడం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -