Saturday, August 16, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ టీచర్ పై అసభ్యకరంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు 

అంగన్వాడీ టీచర్ పై అసభ్యకరంగా మాట్లాడిన కాంగ్రెస్ నాయకుడు 

- Advertisement -

కఠినంగా శిక్షించాలని సిఐటియు సంఘాలు, ప్రజా సంఘాలు 
నవతెలంగాణ – తాడ్వాయి 
: మండలంలోని కాటాపూర్-2 అంగన్వాడి సెంటర్ విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్, కాటాపూర్ లోని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ సర్పంచ్ కు అంగన్వాడి కేంద్రం భవనం దారి సరిగా లేకపోవడంతో, ఈ సమస్యపై సుమారు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు ఫోన్ చేసింది. ఆ సమయంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సాయంత్రం సుమారు 8.30, 9.00 గంటల ప్రాంతంలో తిరిగి ఆ అంగన్వాడి టీచర్ కు ఫోన్ చేశాడు. మీరు అంగన్వాడి టీచర్లు నా మనసులో పడ్డారు. “మిమ్ములను తొక్కుతే, లేవద్దు, అని అసభ్యకరంగా మాట్లాడాడు. ఆమె దీంతో మనోవేదనకు గురై సిఐటియు అంగన్వాడి యూనియన్ నాయకులకు, ప్రజా సంఘాలకు ఆమె ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో ఆమె బాధను విన్నవించింది. నాకు న్యాయం చేయాలని, ఇదివరకు ఒకసారి కూడా ఇలానే అసభ్యకరంగా మాట్లాడడని ఆమె బాధపడింది. గ్రామపంచాయతీ వద్దకు వచ్చిన మాజీ సర్పంచులు, సిఐటియు నాయకులు, వివిధ ప్రజా సంఘాల కుల సంఘాల యూత్ నాయకులు ఆ కాంగ్రెస్ నాయకునికి ఫోన్ చేశారు. మీరు ఏం మాట్లాడారు ఒక అంగన్వాడీ టీచర్ తో ఇలా అసభ్యకరంగా మాట్లాడవచ్చా గ్రామపంచాయతీలో సమస్య పరిష్కరించుకుందాం అని ఫోన్ చేశారు. కానీ ఆయన ముఖం చాటేశాడు. ఫోను కొద్దిసేపు కలవకుండా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఫోన్లో మాట్లాడి 13వ తారీకు గ్రామ పంచాయతీలోని గ్రామ పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని హామీ తీసుకున్నారు. అంగన్వాడి టీచర్ నాకు న్యాయం చేయాలని ఈ కాంగ్రెస్ నాయకుడు ఇలా ఎన్నోసార్లు అసభ్యకరంగా మాట్లాడాలని, ఒక అంగన్వాడీ టీచర్ అయిన, ఒక దళిత మహిళ అని నన్ను అవమాన పరుచుతూ, అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడు మాకు న్యాయం చేయాలని ఆమె వేడుకున్నారు. న్యాయం జరగకపోతే సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంచలంచలుగా ఉద్యమాలు ఉదృతం చేస్తూ ఈ సమస్యను మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్తామని ఆమె అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad