Wednesday, November 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజలను భయపెడుతున్న కాంగ్రెస్‌ నేతలు

ప్రజలను భయపెడుతున్న కాంగ్రెస్‌ నేతలు

- Advertisement -

– ఓటుకు రూ.5వేలు పంపిణీ
– ఫలితాల తర్వాత ఒక్కొక్కరి పని చెప్తా : బీఆర్‌ఎస్‌ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత
నవతెలంగాణ-సిటీబ్యూరో

కాంగ్రెస్‌ నేతలు ఓట్లను రిగ్గింగ్‌ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేయకపోతే రేపటి నుంచి బయట తిరగనివ్వమని బెదిరిస్తున్నారని తెలిపారు. తాను ఎటు వెళ్లినా తన వెనుక 100 మంది వస్తున్నారనీ, మహిళ పట్ల ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా.. అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ వ్యాప్తంగా రౌడీ షీటర్లు తిరుగుతున్నారనీ, పోలీసులు నిజాయితీగా ఉండాలన్నారు. బిర్యానీలో ఓటు రూ.5వేలు డబ్బులు పెట్టి పంచుతున్నారని తెలిపారు. ప్రజలు బయటికొచ్చి ఓటేయాలనీ, లేకపోతే గుండా రాజ్యమే ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఆకు రౌడీలను తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోకి వదిలారనీ, 14వ తేదీ తర్వాత ఒక్కొక్కరి పని చెబుతానని హెచ్చరించారు. మహిళ అని కూడా చూడకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీర్ల ఐలయ్య, ఇతర ఎమ్మెల్యేలకు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఏం పని అని ప్రశ్నించారు. రెండు రోజుల నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గంలోనే ఉంటే ఎన్నికల కమిషన్‌ ఏం చేస్తుందని ప్రశ్నించారు. తనను భయపెట్టాలని చూస్తున్నారనీ, ఎంత మందిని ఆపుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కి ఇంత రౌడీయిజం చేయాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. ఏడిస్తే ఏడ్చారంటున్నారనీ, మనిషికి బాధ అనేది ఉండదా.. అని అన్నారు. కాంగ్రెస్‌ గెలుస్తే రానున్న రోజుల్లో ఏం చేస్తారో అని నియోజకవర్గ ప్రజలు భయపడుతున్నారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -